క్రీజ్‌లోకి మళ్లీ ‘మాస్టర్‌’

క్రికెట్‌ ‘దేవుడు’ సచిన్‌ టెండూల్కర్‌ మళ్లీ క్రీజులోకి దిగాడు. తనను క్రికెట్‌లో రారాజుగా చేసిన బ్యాటింగ్‌తో మళ్లీ మెరిశాడు. ‘కార్చిచ్చు’తో మసి అయిన ఆస్ట్రేలియాలో తన పెద్ద మనసు చాటుకున్నాడు. విరాళాలు పోగు చేసే సత్కార్యంలో తన బ్యాటింగ్‌ ఆట చూపెట్టాడు. బ్యాటింగ్‌ ఎవరెస్ట్, క్రికెట్‌ గ్రేటెస్ట్‌కు బౌలింగ్‌ చేసే అదృష్టం ఆస్ట్రేలియన్‌ మహిళల జట్టు సూపర్‌స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ దక్కించుకుంది. ఈ ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ ఆటగాడు కొంగొత్త డ్రెస్సింగ్‌తో బరిలోకి దిగాడు. పసుపు రంగు హెల్మెట్‌ ధరించి, అల్ట్రాలైట్‌ కూకాబుర్రా లోగో (సాధారణంగా ఎంఆర్‌ఎఫ్‌ లేదంటే అడిడాస్‌ లోగో) ఉన్న బ్యాట్‌తో ఐదు నిమిషాలు సచిన్‌ బ్యాటింగ్‌ చేశాడు.