మొబైల్ ఫోన్ కొనుగోలుదారులకు బ్యాడ్‌న్యూస్. మొబైల్ ఫోన్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం జరిగింది.
మొబైల్ ఫోన్ కొనుగోలుదారులకు షాక్..