కరోనా దెబ్బకు బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ప్రపంచంలోనే బంగారానికి రెండో అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్‌కు మార్చి నెలలో దిగుమతులు ఏకంగా 63శాతం పడిపోయాయి. 2019 మార్చిలో భారత్‌లోకి బంగారం 93.24 టన్నులు దిగుమతి కాగా, ఈ ఏడాది మార్చిలో అది కేవలం 25 టన్నులేనని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆరున్నర సంవత్సరాల్లో ఇదే అతితక్కువ దిగుమతి. దేశాలకు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించటం, అంతర్జాతీయ రవాణా పూర్తిగా స్తంభించిపోవటంతో దిగుమతులపై ప్రభావం పడింది. అంతేకాకుండా లాక్‌డౌన్ కారణంగా దేశంలో బంగారం దుకాణాలు కూడా మూతపడటం దిగుమతులపై ప్రభావం చూపిందని బంగారం వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.
భారీగా తగ్గిన బంగారం దిగుమతులు